PM held a videoconference with Chief Ministers, Discussed points |
Chief Minister Sri K. Chandrashekar Rao has urged Prime Minister Sri Narendra Modi to focus more on increasing the medical facilities in the country, taking lessons from experience the country faced due to the Corona pandemic. The CM expressed his opinion when the PM held a videoconference with ten Chief Ministers in the country on the Corona pandemic issue on Tuesday. Speaking on the occasion, the CM explained to the PM about the Corona situation in the state. The CM said the Corona spread had reminded everyone about the need to increase medical facilities in the country.
“Corona experience has taught us a lesson that there is an urgent need to step up the medical facilities in the country. A visionary outlook and thinking is necessary to take proper and adequate measures in the medical sector for a better future. Strategic planning should be done to create comprehensive medical facilities in the country. Both the Centre and State should jointly implement this comprehensive strategy. We never had any Corona like experience in the past. We do not know how many days this Pandemic will last. While dealing with the existing Corona pandemic, we should focus on how we are going to deal with such a situation in the future and how are we going to offer better medical facilities to people when the need arises. We have to initiate measures now so that whenever an emergency medical situation develops, we will be able to face it efficiently. In the past too, we have seen the emergence of several viruses, and there is every possibility that Corona like the virus may come up again in future. Hence, we have to take measures now to face any eventuality in future. We have to think about what should be the ideal Doctor, people ratio? How many new medical colleges we need? We have to consult Institutions like the Indian Medical Association (IMA), take proper advice and plan the measures. We have to think about these lines and this is a very important issue. The Medical sector should be prepared to face the threat of Corona like viruses in future. The PM should take the initiative in this regard. The Centre and States should jointly work to create better medical facilities in the country,” the CM suggested.
Explaining the measures taken by the state government, the CM said, “We have taken all the measures to contain Coronavirus. The recovery rate in the State is 71 percent while the death rate is 0.7 percent. We have increased the number of tests many fold. We are giving better treatment to the Corona affected patients. We have kept a ready the adequate number of beds, medicines, staff and other equipment. We are diligently following the guidelines issued from time to time by the ICMR, Niti Aayog and the Central government. Medical and Health Staff, Police personnel and other government machinery are working round the clock and rendering their services.”
Medical and Health Minister Sri Eatala Rajender, Government’s Chief Advisor Sri Rajiv Sharma, Chief Secretary Sri Somesh Kumar, DGP Sri Mahender Reddy, Principal Secretary (Medical and Health) Sri Rizvi, Medical Department Heads, Sri Srinivasa Rao, Sri Ramesh Reddy, Sri Gangadhar, Sri Karunakar Reddy and others also participated.
Besides, Telangana, CMs of AP, Karnataka, Tamil Nadu, West Bengal, Maharashtra, Punjab, Bihar, Gujarat and UP interacted with the PM.
కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సూచించారు. పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనాపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ కేసీఆర్ రాష్ట్రంలోని కరోనా పరిస్థితిని వివరించారు. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తు చేసిందని సీఎం అభిప్రాయపడ్డారు.
"కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. వైద్య రంగంలో భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాలి సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక వేయాలి, కేంద్రాలు, రాష్ట్రాలు కలిసి ఈ ప్రణాళిక అమలు చేయాలి. గతంలో మనకు కరోనా లాంటి అనుభవం లేదు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దీని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలాటి పరిస్థితులు వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విషయంపై దృష్టి పెట్టాలి. గతంలో కూడా అనేక వైరస్ లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. కరోనా వైరస్ లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది. వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకునే విధంగా మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత మంది డాక్టర్లు ఉండాలి? ఇంకా ఎన్ని మెడికల్ కాలేజీలు రావాలి? లాంటి విషయాలను ఆలోచించాలి. ఐఎంఎ లాటి సంస్థలతో సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలి. ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఇది దేశానికి మంచి చేసే చర్య. కరోనా లాంటివి భవిష్యత్తులో ఏమి వచ్చినా సరే తట్టుకుని నిలబడే విధంగా వైద్యరంగం తయారు కావాలి. దీని కోసం ప్రధాన మంత్రి చొరవ తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేసి దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది" అని ముఖ్యమంత్రి సూచించారు.
"తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో రికవరీ రేటు 71 శాతం ఉంది. మరణాల రేటు 0.7 శాతం ఉంది. పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కావాల్సినన్ని బెడ్లు, మందులు, ఇతర పరికరాలు, సామాగ్రి సిద్ధంగా ఉంచాం. ఐసిఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం. వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా శక్తి వంచన లేకుండా పని చేస్తున్నది" అని ముఖ్యమంత్రి వివరించారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రిజ్వి, వైద్య శాఖ విభాగాధిపతులు శ్రీ శ్రీనివాస రావు, శ్రీ రమేష్ రెడ్డి, శ్రీ గంగాధర్, కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొనారు.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు మాట్లాడారు.